పెద్దగుల్లాలో తెలుగు , ఉర్దూ మీడీయం పాఠశాలలో ఏపిపి పనులను పరీశీలన

నవతెలంగాణ – జుక్కల్:  మండలంలోని పెద్ద గుల్లా లోని తెలుగు, ఉర్దూ మీడీయం ఎపీయూపీఎస్, ఎంపిపీఎస్ లలో  జుక్కల్  ఎంపిడివో శ్రీనివాస్ మంగళ వారం నాడు పాఠశాలలోని  ఏపీపి పనులు  పరీశీలించడం జర్గంది . ఈ సంధర్భంగా ఎంపిడివో శ్రీనివాస్ మద్యహన బోజనం పరీశీలన చేసి విద్యార్థులకు బోజనంలో ఇంకా ఏమైన మార్పులు అవసరమా ? నిత్యం బాగవండుతున్నారా? విద్యర్థులకు అడిగి తెలుసు కున్నారు. పాఠశాలలో త్రాగు నీరు గురించి కొత్తగా ఏర్పాటు చేస్తున్న సింక్ లను, మరుగుదొడ్లు,  వాష్  రూం, టాయిలెట్లు  పరీశీలించి కొన్ని మార్పులు చేయాలని , పనులు  నాణ్యతగా గుత్తేదారునితో దగ్గరుండి చేయించుకోవాలని హెచ్ఎం లను ఆదేశించారు. సమయ పాలన పాటించాలని లేకుంటే  శాఖపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీపీ కార్యదర్శి, ఉర్దూ హెచ్ఎం సమీనా  బేగం, తెలుగు మీడీయం ఇన్ చార్దీ  హెచ్ఎం మనీషా, ఉపాద్యాయులు మౌనిక, తరన్నుమ్, శ్రీలత తదితరులు  పాల్గోన్నారు.