నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని బడి తండా గ్రామంలో ఐహెచ్ఎల్ పూర్తి చేసుకున్న లబ్ధిదారుల ఇళ్లల్లోకి వెళ్లి పరిశీలించినట్లు ఎంపీడీవో కార్యాలయ ఆఫీసు సూపరిండెంట్ రూపేష్ కుమార్ తెలిపారు. బడతండ గ్రామంలో సోమవారం ఆ పంచాయతీ కార్యదర్శి గణేష్ తో కలిసి ఆన్ లైన్ యాప్ లో ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఐహెచ్ఎల్ జాబితాను పరిశీలించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో ఐహెచ్ఎల్ పనులు గతంలో మొదలుపెట్టి కొన్ని రోజుల వరకు పూర్తి చేసుకోకుండా కొంతమంది ఉన్నారని అన్నారు అందులో కొంతమంది పూర్తి చేసుకుని గతంలోని వారికి రావాల్సిన బిల్లులు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహక డబ్బులను తీసుకున్నారని అన్నారు. కానీ కొంతమంది పూర్తి చేసుకోక పని పెండింగ్లో ఉండి ఇప్పటివరకు వారికి రావాల్సిన డబ్బులు రాలేకపోయాయాని అన్నారు. అటువంటి వారు ఇప్పుడు పూర్తి చేసుకున్న వారి పేరు జాబితాను ఆన్లైన్ యాప్ లో చూపిస్తుందని అన్నారు వాటిని మాత్రమే వారి సొంత ఇంటికి వెళ్లి నిర్మించుకున్న స్థలం వద్దనే ఆన్లైన్ యాప్ లో వారి ఆధార్ కార్డు బ్యాంకు ఎకౌంటు జాబ్ కార్డు నెంబర్ మరియు వాటికి సంబంధించిన నెంబర్లను ఆన్ లైన్ యాప్ లో నమోదు చేస్తున్నామని అన్నారు మండలంలో వివిధ గ్రామాల్లో కొంతమంది అధికారులు వివిధ గ్రామాలలో వివిధ శాఖల అధికారులు పరిశీలిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శి గణేష్ లబ్ధిదారులు ఉన్నారు.