శ్రీ మత్స్యగిరి ఆలయానికి బస్సు రూట్ల పరిశీలన

నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండల పరిధిలోని వెంకటాపురంలో గల శ్రీ మత్స్యగిరి ఆలయానికి భక్తుల సౌకర్యార్థం జిల్లా కేంద్రాల నుండి బస్సులు నడపడానికి ఆర్ ఎం ఓ మాధవి ఆధ్వర్యంలో శనివారం బస్సు రూట్ లను పరిశీలించారు. ఆమె వెంట ఆర్ ఎం(ఎం) శివకుమార్, నల్లగొండ  డిపో మేనేజర్ శ్రీదేవి, యాదాద్రి డిపో మేనేజర్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి,  మాట్లాడుతూ వీలైనంత త్వరగా మత్స్యగిరి గుట్ట కు బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అనంతరం కార్యనిర్వహణాధికారి సల్వాది మోహన్ బాబు   స్వామివారి మెమోంటో ను అందచేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీమాన్ ప్రతాపురం.యాదగిరి స్వామి, సిబ్బంది పాండు, రామనరసింహ తదితరులు పాల్గొన్నారు.