
యాదగిరిగుట్ట మండలం వంగపల్లి సోమవారం, రాష్ట్ర పంచాయితీరాజ్ కమీషనర్ అనితా రామచంద్రన్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. చెరువు పూడికతీత పనులు నిర్వహిస్తున్న కూలీలతో ఆమె మాట్లాడారు. వారికి అందుతున్న వేతన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూలీలకు సరైన వేతనాలు వచ్చేలా చూడాలని, వేసని దృష్ట్యా వారితో ఉదయమే పనులు చేపట్టాలని, పని ప్రదేశాలలో నీడ, మంచినీటి వసతి తప్పనిసరిగా ఉండాలని అధికారులను ఆదేశించారు. స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ మురళి, డి ఆర్ డి ఓ కృష్ణన్, అడిషనల్ డి ఆర్ డి ఓ సురేష్, ఏ పి డి శ్యామల, ఎంపీడీవో కోట నవీన్ కుమార్, ఏపీవో బాల నారాయణ, తదితరులు పాల్గొన్నారు.