నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన మహిళా శక్తి కుట్టుమిషన్ కేంద్రాన్ని శుక్రవారం జిల్లా అదనపు డి ఆర్ డి వో మురళీకృష్ణ సందర్శించి స్కూల్ పిల్లల యూనిఫామ్ కుట్టే వివరాలను ఏపిఎం జగదీష్ ను అడిగి తెలుసుకున్నారు. యూనిఫాంల కుట్టుట పై పలు సూచనలు సలహాలు చేసారు. ఈ సందర్భంగా ఆయన ఐకెపి సిబ్బందికి రివ్యూ నిర్వహించారు. స్కూల్ పిల్లల యూనిఫామ్ కుట్టడంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో మండలంలో చేస్తున్న వివిధ పాఠశాల రిపేర్ పనులను ఆయన సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐకెపి జిల్లా డీపీఎం వకుళ, స్థానిక ఏపిఎం జగదీష్, సీసీలు దత్తు, నారాయణ, రమేష్, శ్రీనివాసరెడ్డి, సాయిలు, రషీద్ సుజాత, మండల సమాఖ్య సిబ్బంది రాజు, రవి తదితరులు పాల్గొన్నారు.