– డిపిఎమ్ఓ చందర్..
నవతెలంగాణ- రెంజల్: మండలంలోని వీరన్న గుట్ట పిఎస్సి లో మంగళవారం డీపీఎంవో చందర్ కుష్టి వ్యాధి నిర్మూలల్లో భాగంగా అనుమానిత కేసులను పరిశీలించారు. ఈ సందర్భంగా పిఎస్సి డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ కుష్టి వ్యాధి శారీరకంగానే కాకుండా మానసికంగా, ఆర్థికపరంగా, సామాజికపరంగా ప్రభావితం చేస్తుందన్నారు. కుష్టు వ్యాధి ముఖ్యంగా శరీరంపై పాలిపోయిన తెలుపు రాగి లేదా ఎరుపు రంగులో స్పర్శ కోల్పోతూ మచ్చ లు ఏర్పడతాయని అలాంటి లక్షణాలు కలవారు వెంటనే డాక్టర్ను సంప్రదించితే ఆరు నెలల్లోపు ఈ వ్యాధి నిర్మూలించవచ్చునని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ శ్రావణ్ కుమార్, ఆరోగ్య కార్యకర్త విజయ, ఆశలు పాల్గొన్నార.