ట్రైనీ ఐఏఎస్ అభివృద్ధి పనుల పరిశీలన

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని పలు గ్రామాల్లో ట్రైనీ ఐఏఎస్ అధికారిణి, డీఅర్డీఏ పిడి సాయ గౌడ్ అభివృద్ధి పనులను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ముల్లంగి(బి) గ్రామంలో ఉపాధిహామీ పనులను, దర్మోరా గ్రామంలో నర్సరీని, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం ను, సింగంపల్లి తండాలో సంపద వనాన్ని పరిశీలించారు. అదే విధంగా కృష్ణ నగర్ లో మహిళ స్వయం సహాయక సంఘాల పని తీరును, మహిళలు అవలంబిస్తున్న అదయ అభివృద్ధి పనులపై అడిగి తెలుసుకున్నారు. మహిళలు డైరీ ఫాం, సోలార్ ప్లాంట్ వినియోగం, పాండిల్స్ తీగలు ద్వారా కూరగాయల పెంపకం, ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతుల గురించి సభ్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది. మహిళలకు పలు సూచనలు కూడా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతి, డీపీఎం సాయిలు,  స్త్రీనిధి ఆర్ఎం రామ్ దాస్, గారు, ఏ పిఎం అనిల్ కుమార్, నాన్ ఫామ్ ఏ పిఎంలు, సిబిఓ ఆడిటర్, సీసీలు, అన్ని గ్రామ సంఘాల వివోఏలు పాల్గొన్నారు.