టెట్ రాసే విద్యార్థులకు ఆయా జిల్లాలోనే పరీక్షలు నిర్వహించాలి

– దూర భారం ఉండడంతో పరీక్షకు దూరమయ్యే పరిస్థితి నెలకొన్నది
– తెలంగాణ రాష్ట్ర బీఈడీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటగిరి కిరణ్ కుమార్ 
నవతెలంగాణ నెల్లికుదురు
టెట్ సెట్ నెట్ ఉదయం సెషన్ రాసే విద్యార్థులకు 15 నిమిషాలు ముందుండాలనే నిబంధన ఎత్తివేసి వాళ్లకు ఎక్కడ జిల్లా వాసుకి అక్కడే చెట్టు పరీక్షలు నిర్వహించి ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర బీఈడీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటగిరి కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఓ ప్రభుత్వమా! విద్యావ్యవస్థ మీద ఎందుకు ఇంత చిన్న చూపు.మీరు డీఎస్సీలో వేస్తున్న పోస్టులే అరకొర అంటే,రాసే టెట్ సెంటర్లు కొరకరానికొయ్యగా అందుబాటులో లేకుండా అల్లంత దూరంగా వేసి మార్నింగ్ సెషన్ ఉదయం 8:45 కి సెంటర్లో వుండాలంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. చలి తీవ్రత,దిక్కుమాలిన దూరం పెట్టుకొని మా ఆడపడుచులు ఎలా రాగలరు.ప్రభుత్వ ఖజానా నింపడానికా ఈ దూరభారం.ప్రభుత్వాలు మారినా మీ పాలన తీరు మారదా?పాలసీలు కొత్తవే కానీ పాతబట్టలు అన్న చందంగా.మీ ప్రభుత్వానికి టెట్,సెట్,నెట్ ఏవైతేనేమి మా ప్రభుత్వం ఇచ్చిందా?లేదా? అనే కాంక్ష తప్పా మా బాధలు కనిపించడం లేదా? విద్యార్థి ఒక జిల్లా రాసి అయితే రెండు మూడు జిల్లాలు దాడి సెంటర్ పడటంతో ఆ విద్యార్థి ఎలా ఆ టైం కు చేరుకొని మహిళలు పురుషులు ఎలా ఎగ్జామ్ రాస్తారని అన్నారు చేరుకోలేక కొంతమంది టెట్ విద్యార్థులు పరీక్షకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని వారి జీవితం నష్టపోయే పరిస్థితి నెలకొంది అని అన్నారు. అందుకోసం ఏ జిల్లా విద్యార్థికి ఆయా జిల్లాలోని ఆదుకోవాలని కోరారు .టెట్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికీ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని, అలాగే మార్నింగ్ సెషన్ వాళ్ళకి 15 నిమిషాలు ముందుండాలి అనే నిబంధన ఎత్తెయ్యాలి. తెలంగాణా రాష్ట్ర బిఈఢీ సంఘం డిమాండ్ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర బీఈడీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటగిరి కిరణ్ తెలిపాడు.