
పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండ సమయస్ఫూర్తి తో పరీక్షలు రాసి మంచి జిపీఏ సాధించాలని వెల్మగూడెం జెడ్పీ హెచ్ ఎస్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గవ్వ హిమావంత్ రెడ్డి సూచించారు. బుధవారం మండలం లోని వెల్మగూడెం జెడ్పీ హెచ్ ఎస్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి విద్యార్థులకు ఎంఎన్ఆర్ పౌండేషన్ ఛైర్మెన్ మందాడి నరేందర్ రెడ్డి అందించిన పరీక్ష కిట్స్ పంపిణి చేసి మాట్లాడారు.విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని క్రమశిక్షణ తో చదివి మంచి మార్కులు సాధించాలని అన్నారు. సమాజం లో మంచి పేరు సాధించి నప్పుడు మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. ఇష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఎం ఎన్ ఆర్ పౌండేషన్ ద్వారా విద్యార్థులకు పరీక్ష కిట్స్ పంపిణి చేయడం అభినదనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అకారపు నరేష్,పౌండేషన్ సభ్యులు రాజేష్, పరమేష్, జయకృష్ణ, రాజాక్,ఉపాధ్యాయులు వసంత కుమార్,రామకృష్ణ రెడ్డి,మహేష్,కృష్ణబాబు, పద్మ,తదితరులు పాల్గొన్నారు.