బహిరంగ ప్రదేశాల్లో మద్యంసేవిస్తే కఠిన చర్యలు: ఎక్సైజ్ సీఐ మధుసూదన్ రావు

నవతెలంగాణ – భిక్కనూర్
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన, నిషేధిత పదార్థాలు సేవించిన కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ మధుసూదన్ రావు తెలిపారు. మంగళవారం జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ రవీందర్ రావు ఆదేశానుసారం గ్రామాలలో అనుమానిత ప్రదేశాలు భిక్కనూరు, పెద్ద మల్లారెడ్డి, కాచాపూర్, రామేశ్వర్ పల్లి గ్రామాలలో పౌల్ట్రీ ఫార్మ్, డబుల్ బెడ్ రూమ్, వ్యవసాయ బావుల వద్ద, పల్లె ప్రకృతి వనం అనుమానం ఉన్న ప్రాంతాలలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు తనిఖీలు చేయడం జరుగుతుందని, ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన, గుడుంబా తయారుచేసిన కేసులు నమోదు చేసి శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ పరిశీలనలో ఎక్సైజ్ ఎస్సై శ్రావణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ మొయినుద్దీన్, కానిస్టేబుల్ వహీద్, బాల్ రాజ్, జాకాబ్, స్వాతి తదితరులు ఉన్నారు.