ప్రారంభానికి సిద్ధమైన ఎక్సైజ్ కార్యాలయం

Excise office ready for opening– నేడు జిల్లా కేంద్రానికి రానున్న ఎక్సైజ్ మంత్రి
నవతెలంగాణ – ఆర్మూర్  

పట్టణ శివారులోని మామిడిపల్లి ఇందిరమ్మ కాలనీ సమీపంలోని ఎక్సైజ్ కార్యాలయ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. దీనితో పాటు బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ ,భీంగల్ లలో భావన నిర్మాణ పనులు 6 నెలల క్రితం పూర్తయ్యాయి. కాగా జిల్లాలో నూతనంగా నిర్మించినటువంటి మూడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ భవనాల ప్రారంభానికి సంబంధిత అధికార యంత్రాంగం ఏర్పాట్లను చేస్తుంది. 2018 సంవత్సరం అప్పటి ప్రభుత్వం భవనాల నిర్మాణం కోసం 40 లక్షల చొప్పున నిధులను విడుదల చేసింది .నిధులు సరిపోక, బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో పనులు పూర్తి కాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆయా ఇంజనీరింగ్ శాఖలకు ఆదేశాలను జారీ చేయగా పనులు త్వరితగతిన పూర్తయ్యాయి. ఇప్పటివరకు అద్దె భవనాలలో స్టేషన్లను కొనసాగిస్తున్నారు. పట్టణంలో ఎక్సైజ్ కార్యాలయం ప్రస్తుతం టీచర్స్ కాలనీ లో అద్దె భవనంలో కొనసాగుతుంది. నేడు జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కృష్ణారావు పర్యటించనున్నారు.

పై అధికారుల ఆదేశానుసారం..
పై ఉన్నతాధికారుల ఆదేశానుసారం త్వరలోనే భవనాన్ని ప్రారంభించి అక్కడకు మార్చుతాము, స్టీవెన్ సన్, ఎక్సైజ్ సీఐ, ఆర్మూర్