విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని అంకాపూర్ గ్రామ ఎస్సీ కాలనీ నిజం సాగర్ కెనాల్ బ్రిడ్జి వద్ద ఎండు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ సిఐ స్టీవెన్ సన్ గురువారం తెలిపారు. ఎక్సైజ్ పోలీసులు బుధవారం సాయంత్రం రూట్ వాచ్ నిర్వహిస్తుండగా తొర్లికొండ నివాసి నూనె కిరణ్, అంకాపూర్ లో నివసిస్తున్న నూనె శ్రీకాంత్ లు కలిసి అక్రమంగా ద్విచక్ర వాహనంపై ఎండు గంజాయిని రవాణా చేస్తుండగా, ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేయగా సంచిలో ఎండు గంజాయి లభించిందని తెలిపారు. అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ నుండి గుర్తుతెలియని వ్యక్తుల నుండి కొనుగోలు చేసి చుట్టుపక్కల గ్రామాలలో చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నట్టు తెలిపారు. వీరి వద్ద నుండి 1.600 ఎండు గంజాయి, ఒక బజాజ్ ప్లాటినా బైకు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని, ఇద్దరిని కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై చంద్రమౌళి, గంగాధర్ గౌడ్ ,సాయిలు, మోహన్, దేవి, దాస్, వికాస్ గౌడ్, నరేష్ ,శ్రీనివాస్, కవిత తదితరులు పాల్గొన్నారు.