ఆద్యంతం ఉద్వేగభరితం

ఆద్యంతం ఉద్వేగభరితంకళా సష్టి ఇంటర్నేషనల్‌, మణిదీప్‌ ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్లపై మహిపాల్‌ రెడ్డి దర్శకత్వంలో జి.శంకర్‌, ఎల్‌.మధు నిర్మించిన చిత్రం ‘ఉద్వేగం’. త్రిగుణ్‌, దీప్సిక జంటగా నటించిన ఈ చిత్రంలో శ్రీకాంత్‌, భరత్‌, సురేష్‌ నాయుడు, పరుచూరి గోపాలకష్ణ, శివకష్ణ, అంజలి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్‌ని డైరెక్టర్‌ ఆర్జీవి విడుదల చేశారు. ఈ నెల 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా పరుచూరి గోపాల కష్ణ మాట్లాడుతూ, ‘సినిమాలో నాయకుడికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రతి నాయకుడికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. దర్శకుడు మహిపాల్‌ రెడ్డి నన్ను ఒప్పించి ఈ సినిమా చేయించుకున్నాడు. హీరో చాలా అద్భుతంగా నటించాడు. చిన్న సినిమాగా కాకుండా ఒక మంచి సినిమాగా ప్రేక్షకులు దీన్ని చూసి విజయం చేకూర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని చెప్పారు.