నవతెలంగాణ-కోహెడ : మండలంలోని గుండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన దండవేని శ్రీచరణ్ జిల్లాస్థాయి కేలో ఇండియా సెంటర్ సైక్లింగ్ పోటీలకు ఎంపిక కావడం పట్ల ఎంపీటీసీ సుతారి కళ్యాణి కనుకరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న శ్రీచరణ్ క్రీడలలో ఉన్నత రంగాలను అందిపుచ్చుకొని గ్రామానికి మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం శ్రీచరణ్‌ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుతారి కనుకరాజు, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు కోనవేని కిషన్, తదితరులు పాల్గోన్నారు.