– టపాకాయలు కాలుస్తూ సంతోషం
నవతెలంగాణ – మద్నూర్
మాజీ ఎమ్మెల్యే హనుమంతు సిండే టిడిపిలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బి ఆర్ ఎస్ లో ఉన్నప్పుడు నేనే మొనగాన్ని నేనే ఎమ్మెల్యేను అంటూ బాగా ఫీల్ అయ్యావు. ఎలాంటి గ్రూప్ రాజకీయాలు నడిపించినా నీ రాజకీయమే నడిచింది. కానీ కాంగ్రెస్ పార్టీలో అదే ఫీలింగ్ అంటే చెల్లదు కదా క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణగానే నడవాలి. హై కమాండ్ మాటలు వినకుంటే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోక తప్పదని బాలు యాదవ్ అన్నారు. గ్రూప్ రాజకీయాలకు పాల్పడుతున్న మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంగమేశ్వర్ ను సస్పెండ్ ప్రకటన చేయడం యువకుల్లో ఎంతో సంతోషం వ్యక్తం అవుతుందని, ఆయన సస్పెండ్ వార్త వినగానే మద్నూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ ఆవరణంలో టపాకాయలు కాలుస్తూ యువకులు సంతోషం వ్యక్తపరిచారు. టిడిపి, టిఆర్ఎస్, బిఆర్ఎస్, పార్టీలో తానంటూ ఏమిటనేది చలాయించుకున్నావు. కాంగ్రెస్ పార్టీలో కూడా అలానే నడిపించుకోవాలనే విధంగా గ్రూప్ రాజకీయాలకు పాల్పడడం కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలకు తావు లేదని అలాంటి వాళ్లకు కాంగ్రెస్ పార్టీ వెంటనే గుర్తిస్తుందని, అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని నీవు కొనసాగించే గ్రూపు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ సరియైన చర్యలు చేపట్టి పార్టీ నుండి సస్పెండ్ చేయడం ప్రతి ఒక్కరూ మీ సస్పెండ్ కు సంతోషిస్తున్నారు. కానీ ఏ ఒక్కరు బాధపడడం లేదని యువకుల్లో ఆనందం వ్యక్తం అవుతుందని ఆయన పేర్కొన్నారు.