ఉత్సాహంగా ఉపన్యాస పోటీలు

నవతెలంగాణ – కంటేశ్వర్
నెహ్రూ యువ కేంద్ర నిర్వహిస్తున్న జాతీయ స్థాయి యువజన పార్లమెంటు ఉపన్యాస పోటీలలో భాగంగా 13 జిల్లాలకు కలిపి నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపన్యాస పోటీలలో 13 జిల్లాలకు చెందిన యువతి యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. న్యాయ నిర్ణయితలు నిర్ణయించిన నాలుగు నిమిషాల సమయంలో దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత యొక్క పాత్రను ఉద్దేశించి సూచించిన మూడు అంశాల మీద ఎంతో ఉత్తేజమైన ప్రసంగాలను ఉత్సాహంగా చేశారు. ఈ పోటీలలో ప్రతి జిల్లా నుంచి ప్రథమ ద్వితీయ విజేతలను రాష్ట్రస్థాయికి పంపనున్నట్లు పోటీల నిర్వాహకురాలు శైలిబెల్లాల్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో గెలుపొందిన వారు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని జాతీయ స్థాయి పోటీలలో గెలుపొందే వారికి రెండు లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి పోటీలకు న్యాయ నిర్ణయితలుగా శ్రీమన్నారాయణ చారి, కళా గోపాల్, కేశవ్ కుమార్, వినయ్ కుమార్ వ్యవహరించారు.నిజామాబాద్, కామారెడ్డి జిల్లా నుంచి విజేతలు వీరేఅక్షిత, ఆకాంక్ష బోస్లే అమోఘవర్ష, కే మౌనిక అనే జిల్లా యోజన అధికారిని నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా శైలి బెల్లాల్ తెలిపారు.