మోడల్ స్కూల్ లో ఉత్సాహంగా ఫుడ్ ఫెస్టివల్ 

నవతెలంగాణ- దుబ్బాక 
దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్లో శుక్రవారం రంగోలి, ఫుడ్, కైట్ ఫెస్టివల్ కార్యక్రమాలను ఉత్సాహంగా జరుపుకున్నట్లు
ప్రిన్సిపాల్ ఎస్. బుచ్చిబాబు తెలిపారు. పాఠశాల విద్యార్థులచే ఏర్పాటు చేసిన 12 స్టాల్స్ లలో విద్యార్తులే స్వయంగా చేసిన పలు రకాల పిండి, తీపి వంటకాలను ప్రదర్శనలో పెట్టారు.ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపాల్ బుచ్చిబాబు అభినందించారు.అనంతరం పతంగులు, రంగవల్లుల కార్యక్రమాన్ని విద్యార్థులు ఉత్సాహంగా జరుపుకున్నారు.ఆయన వెంట మోడల్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ బేతి భాస్కర్, సీఆర్ పీ నవీన్ పలువురున్నారు.