నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
కరాటే ఆత్మరక్షణతో పాటు శరీర ఎదుగుదలకు ఉపయోగపడుతుందని జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి అన్నారు. బుధవారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సహా తైక్వాండో క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అధితిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్ధసారధి మాట్లాడుతూ క్రీడాలు శరీరక దారుఢ్యంలో ముఖ్య పాత్ర పోశిస్తాయన్నారు. కరాటే ఆత్మరణే కాకుండా శరీర ఎదుగుదల ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలు నచ్చిన ఏదైనా ఒక ఆటను ఎంచుకొని సాధన చేస్తు రాణించాలని సూచించారు. పేదరికంలో ఉన్నామని నిరుత్సహ పడకుండా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నేడు ఎంతో మంది క్రీడాకారులు పేదరికం నుంచే వచ్చిన వారని తెలిపారు. క్రీడాల ద్వారా వచ్చిన సర్టిఫికెట్‌లు భవిష్యత్తులో ఉద్యోగ, విద్య అవకాశాలకు ఉపయోగపడుతాయని తెలిపారు. సహా తైక్వాండో క్లబ్ ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందించాలని కోరారు. క్యాడెట్స్ ఉత్సహంగా పోటీల్లో పాల్గొనాలని అన్నారు. అనంతరం క్లబ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అన్నారపు విరేష్ మాట్లాడుతూ క్రీడల అధికారి పార్థసారధి సహాకారం వల్లే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆటల్లో ఉత్సహం ఉన్న పేద విద్యార్థులకు తమ సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని కోరారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్యాడెట్లకు ఈ నెల 19 నుంచి 21 వరకు మంచిర్యాలలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో సహా తైక్వాండో క్లబ్ అధ్యక్షుడు శివప్రసాద్, సహాయ కార్యదర్శి తెలంగ్ అజయ్ కుమార్, కోశాధికారి కన్నె మాధవి, కోచ్ గోంగలి శివప్రసాద్ పాల్గొన్నారు.