హైదరాబాద్ : 14వ మాన్‌సూన్ రెగట్టా పోటీలు హుస్సేన్‌సాగర్‌లో మంగళవారం ఘనంగా ఆరంభమయ్యాయి. తొలి రోజు పోటీల్లో సెయిలర్లు సాగర అలలపై ఉత్సాహంగా పోటీపడ్డారు. అండర్-19 ఇంటర్నేషనల్ క్లాస్ పోటీల్లో నాన్నీస రారు, అనిరాజ్ జోడీ ఐదు పాయింట్లు, ధరణి, మల్లేశ్ జోడీ ఆరు పాయింట్లు, వైద్యాన్షి మిశ్రా, మనీశ్ శర్మ జోడీ 10 పాయింట్లు సాధించారు. అండర్-15 ఆప్టిమిస్ట్ క్లాస్ (బార్సు) విభాగంలో ఏకలవ్య (4), శరణ్య యాదవ్ (6), రూబెన్ విజరు (15) పాయింట్లు సాధించారు. అండర్-15 ఆప్టిమిస్ట్ క్లాస్ (గర్ల్స్) విభాగంలో దీక్షిత (తెలంగాణ) 15, షాగున్ ఝా (మధ్యప్రదేశ్) 16, శ్రేయ కృష్ణ (తమిళనాడు) 31 పాయింట్లు సాధించారు. ఐదురోజుల పాటు జరుగనున్న 14వ మాన్‌సూన్ రెగట్టా పోటీలు శనివారం ముగియనున్నాయి.