ఉత్సాహంగా యోగాసన ఎంపిక పోటీలు

Exciting yogasana selection contestsనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాసన ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. మంగళవారం స్టేడియంలో అండర్ 14, 17 బాల, బాలికల ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు సుమారుగా 80 మంది క్రీడాకారులు ఎన్రోల్ చేసుకున్నారు. జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని, నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగే జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు రేణుక, సంతోష్, చరణ్ పాల్గొన్నారు.