నరేష్, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ నటిస్తున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘వీరాంజనేయులు విహారయాత్ర’. అనురాగ్ పలుట్ల దర్శకుడు. బాపినీడు.బి, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నేటి (బుధవారం) నుంచి ఈ సినిమా ఈటీవీ విన్‌లో స్ట్రీమీంగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని పాత్రికేయులకు ప్రత్యేకంగా ప్రదర్శిం చారు. ఈ సందర్భంగా నరేష్ వికె మాట్లాడుతూ, ‘ఉషాకిరణ్ మూవీస్‌కి ‘శ్రీవారికి ప్రేమ లేఖ’ ఎంత పెద్ద సినిమానో ఈటీవీ విన్‌కి ‘వీరాంజనేయులు విహారయాత్ర’ అంత పెద్ద సినిమా అవుతుంది. రిలీజైన తర్వాత ఈటీవీ విన్‌కి ఇది హయ్యస్ట్ గ్రాసర్ అవుతుంది. ఇందులో ప్రేక్షకులు ఊహించని కామెడీ, డైలాగ్స్ పంచ్‌లు ఉంటాయి. దీంతో పాటు ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుంది. మనసులో మిగిలిపోయే సినిమా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నటుడిగా గొప్ప అనుభూతిని ఇచ్చిన సినిమా ఇది’ అని అన్నారు. ‘ఇంతమంచి నటీనటులు, టెక్నికల్ టీం దొరకడం నా అదష్టం. ఇదొక రిలేటబుల్ మూవీ. హై ఎమోషన్స్ ఉంటాయి. మా సినిమాకి ఆడియెన్స్ తప్పకుండా కనెక్ట్ అవుతారు’ అని దర్శకుడు అనురాగ్ పాలుట్ల చెప్పారు.