ఆదర్శప్రాయుడు అంబేద్కర్ : ముద్దసాని సురేష్ 

నవతెలంగాణ పెద్దవంగర: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంటరానితనం, అసమానతలు, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు, కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపిన మహానుభావుడు అంబేద్కర్‌ అన్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండీ జాను, మార్కెట్ డైరెక్టర్ బానోత్ గోపాల్ నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షుడు గద్దల ఉప్పలయ్య, దుంపల ఉప్పలయ్య, దంతాలపల్లి ఉపేందర్, జాటోత్ వెంకన్న, బానోత్ వెంకన్న, బోనగిరి లింగమూర్తి, చిలుక సంపత్, సుంకరి అంజయ్య దేవా, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.