కులగణన సర్వేల నుండి  ఆశా వర్కర్లకు మినహాయింపు 

Exemption of Asha workers from census surveys– డిఎంఅండ్ హెచ్ఓ హామీ 
– ఆశ యూనియన్( సీఐటీయూ) జిల్లా కమిటీ నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు 
– పల్స్ పోలియో, రిప్రెసి, సర్వే కంటి వెలుగు 
– పెండింగ్ డబ్బులను ఇప్పించండి
– ఆశ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు నూర్జహాన్ డిమాండ్
– ఆశ వర్కర్ల సమస్యల పైన నవంబర్ 4న కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
కుల గణ సర్వేల నుండి ఆశా వర్కర్లకు మినహాయింపు చేయాలని ఆశ వర్కర్లు కోరగా డిఎంహెచ్ఓ హామీ ఇచ్చారని ఆశ యూనియన్ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు శనివారం సీఐటీయూ కార్యాలయంలో ఆశ వర్కర్ల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం డిఎంహెచ్వో కి కులగన సర్వే ఆశ వర్కర్ల చేయము ఈ సర్వేల నుండి మమ్ములను మినాయించండి అని వినతి పత్రం లో కోరగా డిఎంహెచ్ఓ స్పందిస్తూ ఆశ వర్కర్లకు ఈ సమగ్ర సర్వే నుండి (కులగన) సర్వేల నుండి మినయిస్తున్నాము అని చెప్పారు. వారికి సీఐటీయూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఆశా యూనియన్  జిల్లా అధ్యక్షురాలు నూర్జహాన్ మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు పనివారం తగ్గించాలని అధికారుల వేధింపులను ఆపాలని పల్స్ పోలియో, రిప్రెసి సర్వే, కంటి వెలుగు టీబి ట్రైనింగ్, పెండింగ్ డబ్బులు  వెంటనే ఇవ్వాలని ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని వారసత్వాన్ని కొనసాగించాలని. ఈ ఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఆశా వర్కర్ల ఆరోగ్యం పట్ల ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని విధివిధానాలలో ఆశ వర్కర్లు మరణిస్తే వాళ్లకు ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వము 15 రోజుల సమ్మె హామీలు ఆశా వర్కర్ల 15 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను ఫిబ్రవరి 9న ఆరోగ్యశాఖ కమిషనర్ కి ఇచ్చిన హామీలను అమలు చేయాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పారితోషికాలను రూ.18,000 ఫిక్స్డ్ వేతనం గా నిర్ణయించాలి. ఆశాలకు గత గత 19 ఏళ్ల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ సర్వీసు  అందిస్తున్నారు. ఆశా వర్కర్ల వేతనాలు ప్రతినెల ఐదో తారీకు లోపు వారి అకౌంట్లో జమ చేయాలని కోరారు. ఆశా వర్కర్లకు ప్రమాద భీమా సౌకర్యాన్ని కల్పించాలని కోరారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఇస్తున్న పారితోషికంలో సగం పెన్షన్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారానికై వంబర్ 4న జరిగే ధర్నాని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్ జిల్లా నాయకులు సుకన్య,బాలమణి, రేణుక శోభ సిహెచ్ నర్సు రాధా లలిత రేవతి చందన రాణి సుజనా సాహిర వహీదా తదితరులు పాల్గొన్నారు.