– మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. గురువారం రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్టపై 5k రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రన్నింగ్ తో యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తోట మహేష్ , రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకన్న,కౌన్సిలర్లు రోజు రమాదేవి రవీందర్, భాగ్యరెడ్డి, శ్రీనివాస్, ప్రత్యూష, వెంకటరమణ, సత్యనారాయణ, లక్ష్మణ్, వైద్యం కిరణ్, వెంకటాద్రి, డాక్టర్ తిరుపతి, కృష్ణమూర్తి, మారుతీ, రవీందర్, కొత్తశ్రీనివాస్, క్రీడాకారులు, రన్నర్స్ దితరులు పాల్గొన్నారు.