వికలాంగులకు ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరి..

Daily exercise is a must for disabled people.నవతెలంగాణ – నిజాంసాగర్

వికలాంగ విద్యార్థులకు క్రమం తప్పకుండా వ్యాయామం నిర్వహించాలని ఫిజియోథెరపీ డాక్టర్ అరుణ్ కుమార్ అన్నారు. శుక్రవారం మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యానభ్యాసిస్తున  వికలాంగ విద్యార్థులకు  ఫిజియోథెరపీ చికిత్సలు నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికలాంగ విద్యార్థులకు వారి తల్లిదండ్రులు ఇంటి వద్దనే చిన్నచిన్న వ్యాయామ ఆసనాలను చేయించినట్లయితే వారి అవయవ లోపము క్రమేపి తగ్గుదల ఉంటుందని ఆయన సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రాజ్ కాంప్లెక్స్ సిఆర్పి శంకర్ గౌడ్  ఐ ఈ అర్ టి గైని చిన్న సాయిలు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.