గుండెపోటుతో వ్యాయామ ఉపాధ్యాయుడు మృతి

గుండెపోటుతో వ్యాయామ ఉపాధ్యాయుడు మృతి– సోమవారం రాత్రి వరకు పోలింగ్‌ విధుల్లోనే..
నవతెలంగాణ-మంచిర్యాల
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలీవాడలో నివాసముంటున్న వ్యాయామ ఉపాధ్యాయుడు గడికొప్పుల సదానందం(48) మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రిసైడింగ్‌ అధికారిగా విధులు నిర్వహించిన ఆయన రాత్రి ఇంటికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం వాకింగ్‌ చేసి ఇంటికి వచ్చిన కాసేపటికి గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు మంచిర్యాలలో గల ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించే క్రమంలో మరొకసారి గుండెపోటు రావడంతో శ్రీనివాస్‌ మృతి చెందినట్టు కుటుంబీకులు తెలిపారు. శ్రీనివాస్‌ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లోని జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.