
మండలం లోని శాంతినికేతన్ ఉన్నత పాఠశాల లో శనివారం ప్రిన్సిపాల్ నడ్డి ఆంజనేయులు ఆధ్వర్యంలో సంగీతం తో కూడిన వ్యాయామం విద్యార్థులకు నేర్పుతున్నారు. సంగీతం ఎప్పుడూ వ్యాయామంతో ముడిపడి ఉంటుంది. మనలో చాలా మంది పార్క్‌లో జాగింగ్ చేస్తున్నప్పుడు లేదా జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నప్పుడు మనకు ఇష్టమైన సంగీతాన్ని వింటాము, కానీ అది మన వ్యాయామ దినచర్యకు తోడుగా మాత్రమే కాకుండా ఎప్పుడూ ఆలోచించము. కానీ ఇటీవలి శాస్త్రీయ పరిశోధనలు వ్యాయామం చేస్తున్నప్పుడు ‘సరైన’ సంగీతాన్ని ఉపయోగించడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుందనే వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది.
దీనిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ప్రతి మూడవ శనివారం మ్యూజికల్ వ్యాయామం నేర్పిస్తున్నారు.ఈసందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు మెడిటేష్ ద్వారా చదువు పై ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు. వ్యాయామం చేస్తున్నప్పుడు సంగీతం వినడం ద్వారా పొందగల వివిధ ప్రయోజనాలను కనుగొనడానికి ప్రయత్నించడం మరియు ఆ ప్రయోజనాలను తీవ్రతరం చేయడానికి అవసరమైన విదంగా వుంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమీజ, వెంకన్న శ్రీ లక్ష్మి, శంకర్,రాణి, అనిత, మౌనిక, శివలీల, సంధ్య, లావణ్య, శిరీష పుష్ప, లలిత, అపర్ణ, వెంకటేశ్వర్లు, కృష్ణయ్య
రమేష్, రాంరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.