సంక్షేమ పథకాలను వివరిస్తూ కళాకారుల ప్రదర్శన 

నవతెలంగాణ- దుబ్బాక
డీపీఆర్ఓ బిజ్జూరి రవికుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి,సంక్షేమ పథకాలను వివరిస్తూ ‘సాంస్కృతిక సారథి టీమ్’ కళాకారులు మంగళవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హసన్ మీరాపూర్ లో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని టీం లీడర్ జాగోరే రవి తెలిపారు.పంచాయతీ సెక్రెటరీ సిహెచ్ కిషన్, కళాకారులు కొమ్ము రవీందర్, ఈ క్రాంతికుమార్, కొమ్ము ఎల్లయ్య, ముక్కపల్లి భార్గవి, ఏల్పుల తిరుమలయ్య, పిల్లుట్ల శ్యాంసుందర్, సన్వాల కనకయ్య, పిల్లిట్ల ప్రకాష్, గెంటే హరిప్రసాద్, తండ బిక్షపతి ఉన్నారు.