
ఎన్నికల శంఖారావానికి సమయం దగ్గర పడుతుండడంతో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ కిషన్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల ముసాయిదా ఓటర్ జాబితాపై అవగాహన కల్పించి ఓటర్ జాబితా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. రాజకీయపార్టీల నాయకులు ఇంటింటి సర్వేలో భాగంగా అధికారులకు సహకరించాలని కోరారు. జాబితాలో ఏవైనా సవరణలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఎన్నికల జాబితాను పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపిఓ కూచన ప్రకాష్, వివిధ పార్టీ నాయకులు పూస మధు, నూనె అనిల్, కోతి కళ్యాణ్, గుగులోత్ అరుణ్, యాకుబ్, గాజు యాకయ్య తదితరులు పాల్గొన్నారు.