– డబ్ల్యూటీఏ ఫైనల్స్ 2024
రియాద్ (సౌదీ అరేబియా) : మహిళల సింగిల్స్ వరల్డ్ నం.2 ఇగా స్వైటెక్ (పొలాండ్) పోరా టానికి తెరపడింది. గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో విజయం సాధించినా స్వైటెక్‌కు సెమీస్‌లో చోటు దక్కలేదు. గ్రూప్ దశలో మూడో మ్యాచ్‌లో స్వైటెక్ 6-1, 6-0తో దరియ కసట్కినాపై వరుస సెట్లలో విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో కొకా గాఫ్‌పై బార్బర క్రజికోవ 7-5, 6-4తో విజయం సాధించింది. క్రజికోవ విజయంతో స్వైటెక్ సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి. క్రజికోవ, కొకొ గాఫ్, సబలెంకతో పాటు క్విన్వెన్ జెంగ్ సైతం సెమీఫైనల్స్‌కు చేరుకుంది.