అమృతాంజన్‌ కార్యకలపాల విస్తరణ

హైదరాబాద్‌: హెల్త్‌కేర్‌ అండ్‌ వెల్‌నెస్‌ రంగంలోని అమృతాంజన్‌ హెల్త్‌కేర్‌ తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. విజయవాడలో తమ మొదటి ఫిజికల్‌ స్టోర్‌ ‘వరల్డ్‌ ఆఫ్‌ అమృతాంజన్‌’ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఈ కొత్త స్టోర్‌ కంపెనీ విస్తరణలో మరో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని ఆ కంపెనీ చైర్మెన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) ఎస్‌ శంభు ప్రసాద్‌ తెలిపారు. ఇది తమ వినియోగదారులకు తమ నమ్మకమైన శ్రేణీ ఉత్పత్తులను తీసుకురావాలనే నిబద్ధతను ప్రదర్శిస్తుందన్నారు. ఇతర వ్యూహాత్మక ప్రదేశాలలోనూ కొత్త స్టోర్‌లను ప్రారంభించే యోచనలో ఉన్నామన్నారు.