హయర్‌ ఫినిక్స్‌ శ్రేణీ రిఫ్రిజిరేటర్ల విస్తరణ

న్యూఢిల్లీ: ప్రముఖ గృహోపకరణాల ఉత్పత్తుల కంపెనీ హయర్‌ ఇండియా తన డైరెక్ట్‌ కూల్‌ ఫీనిక్స్‌ శ్రేణీ రిఫ్రిజిరేటర్లను విస్తరించినట్లు ప్రకటించింది. 185, 190 లీటర్ల సామర్థ్యంలో అందుబాటులో ఉన్నాయని హయర్‌ అప్లయన్సెస్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఎన్‌ఎస్‌ సతీష్‌ తెలిపారు. ఇవి రూ. 21,000 ధరతో ప్రారంభమవుతాయన్నారు. రెండు మోడళ్లపై 10 సంవత్సరాల కంప్రెసర్‌ వారంటీని అందిస్తోంది.