– హైటెక్స్‌లో మరో సెంటర్ ఏర్పాటు
నవ తెలంగాణ – హైదరాబాద్
ప్రముఖ ఐటి సేవల కంపెనీ హెచ్‌సిఎల్‌టెక్ తన గ్లోబల్ డెలివరీ ఫుట్‌ప్రింట్‌లో భాగంగా హైదరాబా ద్‌లో కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేసిన ట్లు తెలిపింది. హైటెక్‌సిటీ ప్రాంతంలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం లో ఈ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా 5,000 మంది ఉద్యోగులతో క్లౌడ్, కృత్రిమ మేధా (ఎఐ), డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ సొల్యూషన్స్‌లో అంతర్జాతీయ క్లయింట్లకు సేవలు అందించనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. 13.8 బిలియన్ డాలర్ల రెవెన్యూ కలిగిన హెచ్‌సిఎల్‌టెక్ 2007 నుంచి హైదరాబాద్‌లో కార్యకలాపాలను కలిగి ఉంది. నూతన సెంటర్ జోడింపు ద్వారా నగరంలో ఐదు కేంద్రాలకు విస్తరించడంతో పాటుగా 8,500 మంది ఉద్యోగులకు పెంచుకున్నట్లయ్యిందని హెచ్‌సిఎల్‌టెక్ ఎండి, సిఇఒ సి విజరు కుమార్ తెలిపారు.