సర్వేశ్వర్‌ ఫుడ్స్‌ ఉనికి విస్తరణ

హైదరాబాద్‌: సర్వేశ్వర్‌ ఫుడ్స్‌ తన ఫుడ్‌ ప్రింట్‌లను పంజాబ్‌, ఢిల్లీ ఎన్‌సిఆర్‌ ప్రాంతకు విస్తరించినట్లు ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో తన నింబార్క్‌ ఆర్గానిక్‌ స్టోర్‌లను ప్రారంభించినట్లు పేర్కొంది. తమ వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగా వీటిని ఏర్పాటు చేశామని.. ప్రస్తుత త్రైమాసికం చివరి నాటికి ఆ స్టోర్లు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఉత్తరాదిలో తమకు 1200 పైగా స్టోర్లు ఉన్నాయని వెల్లడించింది.