– నగరంలో రివర్ ఇవి తొలి స్టోర్ ఏర్పాటు
హైదరాబాద్ : బెంగళూరు కేంద్రంగా పని చేస్తోన్న విద్యుత్ స్కూటర్ల తయారీ కంపెనీ రివర్ హైదరాబాద్‌లో తన తొలి స్టోర్‌ను ఏర్పాటు చేసింది. బుధవారం దీనిని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు అరవింద్ మణి లాంచనంగా ప్రారంభించారు. కూకట్‌పల్లిలో శ్రీరాజరాజేశ్వర ఈవీ మొబిలిటీ సహకారంతో ఏర్పాటు చేసిన స్టోర్‌లో ఇండి స్కూటర్లు, యాక్సెసరీలు, మెర్చండైజ్ లాంటి సేవలన్ని లభిస్తాయన్నారు. ఇది తమకు మూడో స్టోర్ అని తెలిపారు. సెప్టెంబర్ కల్లా 10 స్టోర్లకు, 2025 మార్చి కల్లా దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో 35-40 అవుట్లెట్లు తెరువాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ నెలలోనే చెన్నరులో కొత్త స్టోర్‌ను ప్రారంభించనున్నామన్నారు ఇండీ స్కూటర్ ఎక్స్‌షోరూం ధరను రూ.1,38,000గా నిర్ణయించామన్నారు.