– అప్పుచేసి డీడీలు చెల్లించిన వైనం..
– వడ్డీ పెరుగుతోందని ఆందోళన చెందుతున్న గొల్ల కురుమలు.
– డీడీలు వాపస్ ఇవ్వాలని అడుగుతున్న లబ్ధిదారులు.
– ఎన్నికలు పూర్తయిన తర్వాతే పథకంపై స్పష్టత వచ్చే అవకాశం..
– రెండో విడతలో యూనిట్ విలువ రూ.1.75 లక్షలు
– లబ్ధిదారుడి వాటాధనం రూ.43,750
– రెండో విడతలో లబ్ధిదారులఎంపిక 17,652.
– డీడీలు చెల్లించిన వారు 3,185.
– గొర్రెలు అందుకున్నవారు 976.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట జిల్లా గొల్ల,కురుమలను ఆర్థికంగా ఆదుకునేందుకు గత ప్రభుత్వం రాయితీపై గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి రావడంతో గొర్రెల పథ కంపై నీలినీడలు ఏర్పడ్డాయి.రాయితీ గొర్రెల పథకం ద్వారా యూనిట్లు పొందేందుకు కొంతమంది గొల్ల, కురుమలు అప్పట్లో అప్పుచేసి మరీ డీడీలు కట్టారు. ప్రస్తుతం పథకం మనుగడలో లేక ప్రశ్నార్థకంగా మారడంతో అప్పు మరింత పెరిగిపోతుందని,డీడీలు వాపస్ ఇవ్వాలని లబ్ధిదారులు అడుగుతున్నారు.
రెండు విడతల్లో పంపిణీ నిర్ణయం..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2017 ఏప్రిల్ 4న 75 శాతం రాయితీపై రెండు విడతలుగా గొర్రెల పంపిజీ చేయాలని నిర్ణయించింది.దీంతో మండల స్థాయి అధికారులు ఎంపీడీఓ,తహసీల్దార్,పశు వైద్యాధికారి సభ్యుల ఉన్నారు.వారు గొర్రెల పంపిణీని డ్రా పద్ధతిన లబ్దిదారులను ఎంపిక చేశారు.జిల్లాలో 280 సొసైటీల్లో 44,943 మంది సభ్యులుగా ఉన్నారు. వారిలో 35,335 మందిని అధికారులు లబ్దిదారులుగా ఎంపిక చేశారు. మొదటి విడతలో లక్కీ డ్రాప్ ద్వారా 17,229 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. ఒక యానిట్ ధర వచ్చి రూ.1,25,000 ఉండగా అందులో 25 శాతం అంటే రూ.31,250 లబ్దిదారుల నుంచి తీసుకోగా ఆ పథకం చివరికి వచ్చేసరికి 1,75000 లకు చేరింది దీంట్లో కూడా 25 శాతం చొప్పున రూ.43,750తీసుకొని(20 గొర్రెలు, ఒక పొట్టేలును) ఒక్కో లబ్దిదారుడికి అందించేవారు.ఆ తర్వాత కరోనా ప్రభావం,ఇతర కారణాలతో ఈ పథకం ముందుకు
సాగలేదు.తర్వాత ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రభుత్వం రెండో విడతకు కొత్త విధి విధానాలు ఖరారు చేసింది.అందులో భాగంగా లబ్దిదారుల నుంచి ప్రభుత్వం డీడీలు తీసుకుంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లాలో 976 మంది లబ్దిదారులకు రాయితీ గొర్రెలు పంపిణీ చేసింది.తొలివిడత మాదిరిగా అందరికీ గొర్రెలు ఇస్తారని ఆశపడిన లబ్ధిదారులు అప్పు తీసుకొచ్చి మరీ డీడీలు చెల్లిం బారులు తీరారు.అయితే అప్పులకు వడ్డీ పెరుగుతూ వస్తోంది.కానీ,రాయితీ గొర్రెలు అందలేదు.
డీడీలు మాకు వాపస్ ఇవ్వాలి..
తొలి విడతలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, రెండో విడతలో పారదర్శకంగా చేపడుతామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండో విడతలో 18,205 మంది లబ్దిదారులను ఎంపిక చేయగా.. జిల్లా వ్యాప్తంగా 20,473 మంది లబ్దిదారులు డీడీలు చెల్లించారు.ఇందులో 976 మంది లబ్దిదారులకు గొర్రెలు కూడా పంపిణీ చేశారు.ఎన్నికలు జరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాయితీ గొర్రెల పథకం ఆమలు పై స్పష్టత లేకుండా పోయింది.గొర్రెల పథకంలో ఆక్ర మాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వస్తుండటం కొంత మంది అధికారులపై వేటు పడటం తో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు.తాము కట్టిన డీడీలు వాపస్ ఇవ్వాలని జిల్లాలో ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఎన్నికలు పూర్తయిన తర్వాతే ఈ పథకంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
పంపిణీ చేయడంలో అన్ని అక్రమాలే..
తొలివిడత గొర్రెల పంపిణీపై కాంగ్రెస్ పార్టీ విచారణ చేపట్టి అక్రమాలు చోటు చేసుకున్నట్లు తేల్చి చెప్పింది. తొలివిడతలో ఒక్కో యూనిట్ ఖరీదు రూ.1.25 లక్షలు కాగా లబ్దిదారులు తన వాటాగా రూ.31,250 చెల్లించారు.మిగితా సొమ్ము ప్రభుత్వం రాయితీ కింద ఇచ్చింది.పశుసంవర్ధక శాఖ అధికారులు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్రల నుంచి గొర్రెలను కొనుగోలు చేసి లబ్దిదారులకు అందజేశారు.అదే సమయంలో గొర్రెలు అందుబాటులో లేకపోవడంతో రీసైక్లింగ్ జరిగినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ చేసిన నివేదికలో తేలింది. గతంలో ఇచ్చిన రాయితీ గొర్రెల పంపిణీపై నివేదిక ఆధారంగా విచారణ చేపడితే అక్రమాలు బయటపడే అవకాశం ఉందని గొల్ల,కురుమ సంఘాల వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదు..
జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఎ.కుమారస్వామి..
గొర్రెల యూనిట్ల కోసం డీడీలు కట్టిన లబ్దిదారులకు డీడీలు వాపస్ చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. జిల్లాలో డీడీలు కట్టిన వారి వివరాలు, ఇప్పటి వరకు గొర్రెలు అందజేసిన లబ్ధిదారుల వివరాలు ఉన్నతా ఆధికారులకు అందజేశాం.డీడీలు వాపస్ ఇవ్వాలని లబ్దిదారులు కోరుతున్నారు.వారి వివరాలు కూడా ఉన్నతాదికారులకు అందజేశాం.ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే వాటిని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.