టెండర్స్ ప్రక్రియను వేగవంతంగా చేపట్టండి: కలెక్టర్

Expedite the process of tenders: Collectorనవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
మున్సిపల్ పరిధిలో చేపట్టే పనులకు సత్వరమే టెండర్స్  ప్రక్రియను చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ కాన్ఫెరెన్స్ హాల్ లో  కోదాడ, హుజూర్ నగర్, నేరేడు చర్ల మున్సిపాలిటీ ల పరిధిలో పి.యూ.ఎఫ్.ఐ. డి.సి ద్వారా  కోదాడ కు రూ. 20 కోట్లు, హుజూర్ నగర్ కి రూ.5 కోట్లు, అలాగే నెరేడుచర్ల 15 కోట్లు మొత్తం రూ. 40 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు.   ఆయా మున్సిపాలిటీల పరిధి లలో   చేపట్టవలసిన పనులపై సమీక్షించారు.   అలాగే మున్సిపల్ నిబంధనల మేరకు డి.పి.ఆర్. పూర్తి చేసి   వారం లోపు టెండర్స్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి మున్సిపాలిటీ వారీగా చేపట్టిన పనులు, చేపట్టవలసిన పనులపై సంబంధిత అధికారులతో  సమీక్షించారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్.సి.  నర్సింహారావు,మిషన్ భగీరథ ఈ. ఈ  శ్రీనివాస్,  పి.ఆర్. వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాస్ రెడ్డి, నేరేడు చర్ల అశోక్ రెడ్డి, ఈ. ఈ ప్రసాద్,  కోదాడ డి.ఈ సత్యరావు ఏ.ఈ లు నరేందర్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.