తమ 3వ ఎడిషన్ తో తిరిగి వచ్చిన అనుభవపూర్వమైన మ్యూజిక్ ఫెస్టివల్ –  రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

ఇంతకు ముందు రెండు ఎడిషన్స్ యొక్క సంచలనాత్మక విజయంతో, సీగ్రమ్ రాయల్ స్టాగ్ అనుభవపూర్వకమైన మ్యూజిక్ ఫెస్టివల్, రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ ను మళ్లీ వాపసు తెచ్చింది. ఈ ఉత్సవం బాలీవుడ్ మరియు హిప్-హాప్ మ్యూజిక్ యొక్క విభిన్నమైన  శైలులు రెండిటిని సంబరం చేస్తుంది. కొత్త బీట్స్ మరియు సహజమైన సౌండ్ స్కేప్ తో, ఈ ఏడాది శ్రేణిలో ప్రముఖ కళాకారులైన అర్మాన్ మాలిక్, అమిత్ త్రివేది, నీతి మోహన్, నిఖిత గాంధీ, రఫ్తార్, ఇక్కా మరియు డిజే యోగి ఉన్నారు.

నవతెలంగాణ హైదరాబాద్: సమకాలీన హిప్-హాప్ బీట్స్ తో బాలీవుడ్ లో ప్రసిద్ధి చెందిన శ్రావ్యమైన గీతాలను మిశ్రమం చేసిన తమ మూడవ ఎడిషన్ కోసం సీగ్రమ్  రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మళ్లీ వచ్చింది. ఈ సీజన్ ను  మిర్చి తయారు చేస్తుండటంతో, ఈ లీనమయ్యే మ్యూజిక్ ఫెస్టివల్ జనవరి 14, 2025న ముంబైలో జరిగిన ప్రత్యేక మీడియా ప్రివ్యూలో రాబోతున్న శ్రేణిని ప్రదర్శించింది. ఈ విలక్షణమైన సాంస్కృతిక కలయిక సంప్రదాయబద్ధమైన మరియు ఆధునిక భారతదేశపు సంగీతం యొక్క కూడలిని పునర్నిర్వచించడం కొనసాగించింది, బ్రాండ్ యొక్క ‘లివింగ్ ఇట్ లార్జ్ లీ‘ సిద్ధాంతానికి చిహ్నంగా నిలిచింది.

వినియోగదారులు పాల్గొనడానికి కీలకమైన మూలస్తంభంగా బ్రాండ్ కోసం మ్యూజిక్ నిలిచింది. రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ బాలీవుడ్ శాశ్వతమైన శ్రావ్య గీతాలను హిప్-హాప్ ఉత్సాహంతో ఎంతో ధైర్యంగా కలిపింది. నేటి తరం, జనరేషన్ లార్జ్ యొక్క ఒరిజినల్ సౌండ్ ను తయారు చేసింది. ఫెస్టివల్ యొక్క విలక్షణమైన రూపం ట్రెండ్స్ ను అనుసరించడానికి బదులు ట్రెండ్ ను సృష్టించే నేటి యువతకు అనుగుణంగా ఉండే విలక్షణమైన సౌండ్ ను తయారు చేసింది.

ఫెస్టివల్ నాలుగు ప్రధాన యువ కేంద్రాలు – హైదరాబాద్, ముంబయి, గురుగ్రామ్ మరియు గౌహతిలలో ప్రయాణించింది – ఆధునిక పరస్పర ప్రతిచర్య అనుభవాలతో పాటు ప్రధానమైన సంగీత కార్యక్రమాలను ప్రదర్శిస్తుంది. వివిధ నగరాల నుండి సుమారు 1 లక్షమంది  సంగీత ప్రియుల్ని ఇంతకు ముందు రెండు ఎడిషన్స్  ఆకర్షించాయి మరియు డిజిటల్ ప్లాట్ ఫాంలలో 200 మిలియన్ + వ్యూస్ ను ఉత్పన్నం చేసాయి. కార్యక్రమానికి హాజరైన వారు ఆర్ట్ ఇన్ స్టలేషన్స్, AR/VR టెక్నాలజీ మరియు AI మద్దతుతో వ్యక్తిగత సందేశాలు పంపించడం వంటి వాటిలో పాల్గొనవచ్చు. ఇంకా, ప్రముఖ స్థానిక కళాకారులచే ప్రదర్శనలు ఉంటాయి.

ఈ ఏడాది, ప్లాట్ ఫాం సీగ్రమ్ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ కి మొదటిసారి గేమింగ్ అనుభవం తీసుకువచ్చే ఆధునిక మార్కెటింగ్ ఏజెన్సీ Ampverse DMI Pulseతో కూడా అనుసంధానం చెందింది. యువత పోకడలను మరియు గేమింగ్ మరియు వినోదం యొక్క కూడలిని గుర్తించడంలో తమ నైపుణ్యాన్ని వినియోగించి, ప్రముఖ గేమింగ్ ఇన్ ఫ్లూయన్సర్స్  బృందం రూపొందించబడింది. ఈ బృందం ప్రతి నగరంలో ప్రేక్షకులలో సంచలనం కలిగిస్తుంది. ఈ ఇన్ ఫ్లూయన్సర్స్ ఉత్సాహవంతమైన EAFC 24 గేమింగ్ షోడౌన్ లో పాల్గొంటుంది, హైదరాబాద్, ముంబయి మరియు గురుగ్రామ్ లకు అత్యంత ఉత్సాహవంతమైన పోటీని తెస్తుంది. కార్యక్రమంలో షోడౌన్స్, లోతైన గేమ్ ప్లే, లైవ్లీ బాంటర్ మరియు వాస్తవిక సమయంలో ప్రజలతో సంభాషించడం, గేమింగ్, మ్యూజిక్ మరియు లైవ్ వినోదంలో నిరంతరంగా కలిసిపోయే లీనమయ్యే అనుభవం కలిగిస్తుంది.

లైవ్ కార్యక్రమాలకు అనుబంధంగా, బ్రాండ్ ఇన్-స్టూడియో సహకారాలు అందచేస్తుంది, శ్రావ్యమైన సంగీతం మరియు హిప్-హాప్ అంశాలతో మిశ్రమం చెందే ఒరిజినల్ ట్రాక్స్ ను సృష్టిస్తుంది. డిజిటల్ ప్లాట్ ఫాంలలో వీడియోలతో పాటు సింగిల్స్ గా ఇవి విడుదలవుతాయి.

కార్తీక్ మొహీంద్రా, ఛీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మరియు పెర్నాడ్ రికార్డ్ ఇండియాలో గ్లోబల్ బిజినెస్ డవలప్ మెంట్ హెడ్ ఇలా అన్నారు, “ప్రజలను ఐక్యం చేయడానికి మరియు స్వచ్ఛమైన మేజిక్ యొక్క క్షణాలను సృష్టించడానికి మ్యూజిక్ యొక్క విశ్వజననీయ భాషకు ప్రత్యేకించి లైవ్ అనుభవాలలో, ఈ విశేషమైన శక్తిని కలిగి ఉంది. రాయల్ స్టాగ్  యువతకు మ్యూజిక్ ను తమ కీలకమైన అభిరుచి మూలస్థంభంగా సంబరం చేయడం కొనసాగిస్తోంది. ఇప్పుడు, మేము రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మూడవ ఎడిషన్ విడుదల చేస్తున్న సందర్భంలో, ఉత్తేజభరితమైన కొత్త సౌండ్ స్కేప్తో అనుభవాన్ని పెంచడానికి సిద్ధంగా ఉంది, ఆర్ట్ మరియు సాంస్కృతిక అనుభవాలతో పాటు హిప్-హాప్ యొక్క సంచలనాత్మకమైన బీట్స్ తో బాలీవుడ్ మెలొడీస్ ను మిశ్రమం చేస్తూ బ్రాండ్  యొక్క లివింగ్ ఇట్ లార్జ్ సిద్ధాంతానికి ఉదాహరణగా నిలిచింది.”

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ యొక్క మూడవ ఎడిషన్ గురించి మాట్లాడుతూ, అజయ్ గుప్తా, సిఈఓ-దక్షిణాసియా, వేవ్ మేకర్ ఇలా అన్నారు, “రాయల్ స్టాగ్ నేటి యువత కోసం మ్యూజిక్ ను ఒక కీలకమైన అభిరుచి అంశంగా ఎల్లప్పుడూ భావించింది. రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ ఈ 3వ ఎడిషన్ లో, మా ‘లివ్ ఇట్ లార్జ్’ సిద్ధాంతాన్ని మేము విస్తృతం చేస్తున్నాం. మేము నిజంగా ప్రత్యేకమైన దానిని చేరుకుంటున్నామని ఇంతకు ముందు కార్యక్రమాలు సాధించిన అనూహ్యమైన విజయాలు నిరూపించాయి. బాలీవుడ్ ఉద్వేగభరితమైన మెలొడీస్ యొక్క వాస్తవమైన కలయిక మరియు హిప్-హాప్ యొక్క ఉత్సాహం యొక్క మరింత చురుకైన అనుభవాన్ని ఊహించండి. మ్యూజిక్ ఫెస్టివల్స్ ను పునర్విర్వచించే ఉత్సాహవంతమైన బృందం కోసం సిద్ధంగా ఉండండి.”

యతీష్ మెహ్ రిషి, ENIL సిఇఓ ఇలా అన్నారు, “రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మ్యూజిక్ మేజిక్ ద్వారా ప్రజలను ఒక చోట చేర్చడానికి సంబంధించినది – ఇది వినూత్నత సంస్కృతిని కలుసుకోవడానికి, సంప్రదాయం ఆధునిక ఉద్వేగాలతో నిరంతరంగా కలుసుకోవడానికి చెందినది. ENILలో విభిన్నతను సంబరం చేసే మరియు మరపురాని క్షణాలను సృష్టించే  ప్రత్యేకమైన  విషయం పై సహకరించడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. దేశవ్యాప్తంగా జీవిత కాలం అపురూపంగా దాచుకునే  స్థాయిని పెంచడానికి, శక్తి, ఆనందం మరియు జ్ఞాపకాలను పెంచడానికి  ఈ ఎడిషన్  ఒక అభివృద్ధికరమైన ప్రయత్నం.”

చార్లీ బైల్లీ, సిఈఓ మరియు సహ-స్థాపకులు, ఆంప్ వర్స్ గ్రూప్ ఇలా అన్నారు, “ఈ అద్భుతమైన సాంస్కృతిక సంబరం యొక్క హృదయంలోకి గేమింగ్ ను తీసుకువస్తున్న సీగ్రామ్ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మూడవ ఎడిషన్  తో భాగస్వామం కోసం మేము ఉత్సాహంగా ఉన్నాము. నేటి యువత తమను తాము ఎలా వ్యక్తం చేసుకుంటారు, ఎలా కనక్ట్ అవుతారు విషయంలో గేమింగ్ కీలకమైన బాధ్యతవహిస్తోంది మరియు PULSE నుండి వచ్చిన అభిప్రాయాలతో, గేమింగ్, మ్యూజిక్ మరియు వినోదం యువ సాంస్కృతిని తీర్చిదిద్దడంలో ఒక దానితో మరొకటి విలీలనమవడం మేము చూసాము. ఈ సహకారం లోతైన గేమ్ ప్లే, ఫన్ బాంటర్ మరియు నిజమైన ప్రజల ఉత్సాహాన్ని కలిపే  నిజంగా ప్రత్యేకమైన గేమింగ్ షోడౌన్ ను సృష్టించడంలో మాకు సహాయపడుతుంది. Ampverse DMI Pulseలో, మేము లైవ్ కార్యక్రమాలను పునః ఊహించడంలో సహాయపడటానికి మరియు జనరేషన్ లార్జ్ తో నేరుగా మాట్లాడే ప్లాట్ ఫాంలో భాగంగా ఉండటానికి  మేము గర్విస్తున్నాం”

మ్యూజిక్ డైరెక్టర్ మరియు సింగర్ అమిత్ త్రివేది ఇలా అన్నారు, “రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మ్యూజిక్ యొక్క అందమైన సంబరం- హృదయం నుండి నేరుగా, సహజంగా మరియు ప్రామాణీకరంగా వచ్చింది. మెలొడీస్ ద్వారా కథలను భాగస్వామ్యం చేయడం మరియు ప్రజలతో లోతైన స్థాయిలో కనక్ట్ అవడం గురించి అని నేను భావిస్తాను. ఈ ప్లాట్ ఫాంతో భాగంగా ఉన్నందుకు నేను నిజంగా కృతజ్ఞతగా భావిస్తున్నాను మరియు ప్రేక్షకులతో కలిసి కొన్ని గుర్తుండిపోయే క్షణాలను కలిగించడానికి ఆతృతగా ఉన్నాను.

గాయకుడు-పాటల రచయిత అర్మాన్ మాలిక్ ఇలా అన్నారు, “ఏ భాష మాట్లాడినా మరియు ఏ ప్రాంతానికి చెందిన ప్రజలతోనైనా  కనక్ట్ అవడానికి మ్యూజిక్ నే నేను మార్గంగా ఎంచుకున్నాను. గత ఏడాది దేశవ్యాప్తంగా రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ కోసం ప్రదర్శించడం మర్చిపోలేని అనుభవం – ప్రతి నగరం నుండి ప్రజల నుండి వచ్చిన ఉత్సాహం నిజంగా ఉల్లాసకరం. నేను అద్భుతమైన ప్రజల్ని కలుసుకోవడానికి, వివిధ సంస్కృతులను అనుభవించడానికి మరియు మ్యూజిక్ ప్రతి ఒక్కరిని ఎలా కలుపుతుంది నేరుగా చూడటానికి నాకు అవకాశం లభించింది. ఇప్పుడు భారతదేశం వ్యాప్తంగా వివిధ నగరాలలో నేను  ప్రదర్శన చేస్తున్న సందర్భంలో ప్రేక్షకులతో మరింత అద్భుతమైన క్షణాలను సృష్టించడానికి నేను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను.”

గాయని నీతి మోహన్ ఇలా అన్నారు, “ప్రజల్ని కలపడానికి మ్యూజిక్ ఎల్లప్పుడూ ప్రపంచవ్యాప్తమైన భాషగా నిలుస్తుంది. ఈ ప్లాట్ ఫాం కళాకారులకు కేవలం ప్రదర్శన కోసం మాత్రమే కాకుండా అభిమానులతో లోతుగా కనక్ట్ అవడానికి కూడా ఇది అద్భుతమైన ప్రదేశం. పరవశించిపోయే మెలొడీస్ తో నిండిన, నృత్యానికి తగిన బీట్స్ మరియు గుర్తుండిపోయే జ్ఞాపకాలను కలిగించే కార్యక్రమం చేయడానికి నేను ఎదురుచూస్తున్నాను!”

గాయని నిఖిత గాంధీ ఇలా అన్నారు, “వ్యక్తిగతంగా నాకు, రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ ఎల్లప్పుడూ మ్యూజిక్ ద్వారా హద్దుల్ని అధిగమించి, ప్రయోగం చేస్తుందని భావిస్తాను. అది శైలుల కలయిక కావచ్చు లేదా ఉల్లాసకరమైన లైవ్ పెర్ఫార్మెన్స్ కావచ్చు, మేము సృజనాత్మకమైన పరిమితులను మించి ప్రదర్శించడానికి ఈ ప్లాట్ ఫాం మాకు అవకాశం ఇస్తుంది. నేను ఈ ఏడాది బృందంతో పాటు ఉన్నందుకు  మరియు అలాంటి గొప్ప ప్రేక్షకులతో మ్యూజిక్ ద్వారా నా ప్రయాణాన్ని భాగస్వామం చేయడానికి ఉద్వేగంగా ఉన్నాను”.

ప్రముఖ హిప్-హాప్ కళాకారుడు రఫ్తార్ ఇలా అన్నారు, “ప్రభావం చూపించే బీట్స్, ఉద్వేగాలు ఎల్లప్పుడూ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ లో కీలకమైన అంశంగా ఉంటాయి. నా అభిప్రాయంలో ఇది ర్యాపింగ్ కు మించినది – ఇది ప్రజలను ఉత్సాహవంతమైన మరియు ఉద్వేగభరితమైన ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. నేను ఈ ఏడాది నా A-gameను తెస్తున్నాను మరియు సహజమైన ఉత్సాహం మరియు ఉత్సాహోల్లాసాలతో వేదిక దద్దరిల్లిపోయేలా చేయడానికి నేను ఆతృతగా ఉన్నాను!”

కళాకారుడు ఇక్కా ఇలా అన్నారు, “ప్రతి కళాకారుడు లేదా కళాకారిణి తమ విలక్షణమైన సౌండ్ మరియు ఉద్వేగం చూపించడానికి అవకాశం ఇచ్చిన కారణంగా రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ ను ప్రత్యేకంగా నిలిపింది. నేను వేదిక పైన నా సిగ్నేచర్ దేశీ హిప్-హాప్ స్టైల్ ను తీసుకురావడానికి మరియు ప్రజలకు అనుగుణంగా ఉండే సంగీత అనుభవాన్ని సృష్టించడానికి  ఉద్వేగం చెందాను. ఇది నిజమైన కథలు, కిల్లర్ బీట్స్ మరియు గుర్తుండిపోయే క్షణాలకు సంబంధించిన కార్యక్రమంగా మారనుంది!”

DJ యోగి ఇలా అన్నారు, “రాయల్ స్డాగ్ బూమ్ బాక్స్ ప్రేక్షకులు మ్యూజిక్ ద్వారా సజీవమైన అనుభూతి చెందడానికి సంబంధించినది. సంచలనం కలిగించే వాతావరణం కలిగించడానికి బీట్స్ ను మరియు శైలులను మిశ్రమం చేయడమే DJగా నా లక్ష్యం. ఈ ఏడాది నా ఉత్సాహాన్ని తీసుకురావడానికి మరియు కార్యక్రమాన్ని ఒక పెద్ద, మర్చిపోలేని పార్టీగా చేయడానికి నేను ఉత్సాహంగా ఉన్నాను!” గేమింగ్ యూట్యూబర్ ShreeMan LegenD ఇలా అన్నారు, “గేమర్ మరియు క్రియేటర్ గా, నేను ఈ అతుల్యమైన అవకాశం కోసం Ampverse DMI Pulseతో సహకరించడానికి  మరియు రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ తో భాగంగా ఉండటానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ లో లైవ్  గేమింగ్  ఫేస్-ఆఫ్స్ అనుభవానికి ఉల్లాసభరితమైన కోణాన్ని చేరుస్తుంది, మరియు వేదిక పైన గేమింగ్ ప్రజల ఉత్సాహాన్ని తీసుకురావడానికి నేను ఎంతో ఆతృతగా ఉన్నాను. భవిష్యత్తులో యువత-కేంద్రీయంగా వినోదం చూపించడానికి ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయి.”