కాలం చెల్లిన సరుకులు వాడరాదు..

Expired goods should not be used.– వసతి గృహం తనిఖీ చేసిన కలెక్టర్
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
కాలం చెల్లిన సరుకులు వాడరాదని, సరుకులు తెచ్చేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాలని, మెనూ ప్రకారం విద్యార్ధులకు నాణ్యతా ప్రమాణాలు పాటించి ఆహారాన్ని అందించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా స్టోర్ రూమ్ డైనింగ్ హల్ ను పరిశీలించారు. వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. ప్రజాపాలన విజయోత్సవాలు సందర్భంగా విద్యార్ధులతో ముచ్చటిస్తూ ఆరు గ్యారంటీలపై వివరించారు. విద్యార్ధులు బాగా చదువుకోవాలని, ఎలాంటి ఒత్తిడికి లోనూ కాకుండా శ్రద్ధతో చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని అన్నారు. వసతి గృహం సందర్శించి సరుకుల నాణ్యతా ప్రమాణాలు పరిశీలించారు. డైనింగ్ హాల్, వంట గది ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు లలిత కుమారి, ఉపాధ్యాయులు సిబ్బంది ఉన్నారు.