కాలం చెల్లిన పురుగుల మందు నిల్వలు..

– పట్టించుకోని వ్యవసాయ శాఖాధికారులు
– క్షేత్రస్థాయి పర్యవేక్షణలో అధికారుల అలసత్వం
నవతెలంగాణ – బెజ్జంకి
మండలంలో వ్యవసాయ శాఖాధికారులు విధుల్లో అలసత్వం వహిస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోంది. అలసత్వానికి నిదర్శనంగా మండలంలో కాలం చెల్లిన పురుగుల మందుల నిల్వలు సోమవారం దర్శనమిచ్చాయి.ఎరువుల దుకాణాల్లో పురుగుల మందుల నిల్వలను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించడంలో మండలంలోని వ్యవసాయ శాఖాధికారులు నిర్లక్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు రైతుల్లో వెల్లువెత్తుతున్నాయి.కాలం చెల్లిన పురుగుల మందులను అరికట్టాల్సిన మండల వ్యవసాయ అధికారులు చూసిచూడట్టు వ్యవహరిస్తున్నారని ఇప్పటికైనా సంబంధిత జిల్లాధికారులు స్పందించి అరికట్టాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.