నవతెలంగాణ – నెల్లికుదురు
ఎస్సీ ల వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అంటూ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని సుప్రీంకోర్టు ప్రకటన పట్ల ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు తుళ్ళా వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు గుండె పాక ఉప్పలయ్య బీరు యాకయ్య మాజీ వైస్ ఎంపీపీ జల్ల వెంకటేష్ ఎస్సీ సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ పుల్ల ప్రణయ్ డిసిసి ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్ హర్ష వ్యక్తం తెలిపారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి గురువారం సంతోష వ్యక్తం చెందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల నుంచి ఎన్నో రకాల పోరాటాల ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చినందున మాదిగ జాతికే వన్నెతెచ్చిన మందకృష్ణ మాదిగకు రుణపడి ఉంటామని ఆయనకు కృతజ్ఞతలు అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తూల్ల చిన్న వెంకన్న హెచ్ శ్రీను గుండెపాక వెంకన్న దండపెల్లి సైదులు కడారి ఐలయ్య వెంకటస్వామి కడారి ఐలయ్య ఇరుగు అనిల్ సోమ నరసయ్య జిలకర యాలాద్రి, ఎడ్ల మహేష్ తుల్ల వివేక్ గడ్డమీది వేణు వెంకటేష్ జిలకర యాలాద్రి అశ్విని తదితరులు పాల్గొన్నారు.