నవతెలంగాణ – నెల్లికుదురు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి యనుమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉత్సవం చేసిన సందర్భంగా హర్ష వ్యక్తం ప్రకటిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఆకల కొమురెల్లి తెలిపాడు. మండల కేంద్రంలో ఆ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరికుoట్ల మోహన్ అందరితో కలిసి సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని ఉద్దేశంతో ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు అహర్నిశలు కృషి చేసి గెలుపు కోసం ముందుండి పోరాడిన కార్యకర్తలకు కృతజ్ఞతలు అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి తోనే తెలంగాణ సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ప్రత్యేక చొరవ తీసుకొని కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు అభివృద్ధి పరుస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు హెచ్ మల్లేష్ గ్రామ ప్రధాన కార్యదర్శి ఆకుల నాగన్న గ్రామ కార్యదర్శి మంచాల వెంకన్న బూర్గుల రజిని కుమార్ తదితరులు పాల్గొన్నారు