పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిన గోవర్ధన్ ను పార్టీ నుండి బహిష్కరణ 

నవతెలంగాణ- కంటేశ్వర్:

సీపీఐ(ఎం) పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేసిన మల్యాల గోవర్ధన్ గతంలోనే పార్టీ జిల్లా బాధ్యతలనుండి బహిష్కరించటం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో తప్పు చేయనని చేసిన విజ్ఞప్తి మేరకు పార్టీ బాధ్యతలు అప్పగించిన వాటిని నిర్వర్తించలేనని చెప్పిన సందర్భంలో కూడా 15 రోజుల క్రితమే పార్టీ నుండి బహిష్కరించడం జరిగింది. ఇప్పుడు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడుగా బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరినట్లు ప్రకటించటం పూర్తిగా బాధ్యత రహితం దీన్ని సీపీఐ(ఎం) పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రజా సమస్యలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానంగా పేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వలేని పరిస్థితుల్లోనే సీపీఐ(ఎం) పార్టీ నిర్వహించిన భూపోరాటాలలో పాల్గొని ఆ ప్రజలను మభ్యపెట్టి అదే పార్టీలోకి తనతో తీసుకెళ్లటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు ప్రజాస్వామిక వాదులు పార్టీ సానుభూతిపరులు శ్రేయోభిలాషులు గోవర్ధన్ చర్యలను గమనించి అతనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని కోరుతున్నాం. పార్టీ పేరును వాడుకొని స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తులను సీపీఐ(ఎం) పార్టీ ఎప్పుడు క్షమించదని తెలియజేస్తున్నాం. సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, సిఐటియ జిల్లా  కార్యదర్శి శినూర్జహాన్ పాల్గొని మాట్లాడారు.