జేడీఎస్‌ పార్టీ నుంచి ప్రజ్వల్‌ బహిష్కరణ

Expulsion of Prajwal from JDS partyబెంగళూరు : మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు ప్రజ్వల్‌ రేవణ్ణపై జెడిఎస్‌ వేటు వేసింది. హసన్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించిన అసభ్యకర వీడియోలు గత కొన్నిరోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ వ్యవహారంలో జెడిఎస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజ్వల్‌ రేవణ్ణను, అతని తండ్రి హెచ్‌డి రేవణ్ణలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు మాజీ ముఖ్యమంత్రి హెడ్‌డి కుమారస్వామి మంగళవారం వెల్లడించారు. వారిని సస్పెండ్‌ చేయాలని సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్లు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే ప్రజ్వల్‌ను పార్టీ నుంచి బహిష్కరించేందుకు నిర్ణయం తీసుకున్నామని, ఈ దీనిపై జెడిఎస్‌ కోర్‌ కమిటీ సమావేశంలో చర్చించి ప్రకటన చేస్తామని కుమారస్వామి పేర్కొన్నారు.