సీపీఐ(ఎం) నుండి రవినాయక్‌ బహిష్కరణ

– పార్టీ జిల్లా కార్యదర్శి మల్లునాగార్జున్‌రెడ్డి
నవతెలంగాణ-హుజూర్‌నగర్‌టౌన్‌
సీపీఐ(ఎం) పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా, ఒంటెద్దు పోకడలతో ప్రవర్తిస్తూ పార్టీకి నష్టం చేస్తున్నందున పార్టీ నుండి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రవినాయక్‌ను బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి తెలిపారు. మంగళవారం హుజూర్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మహాసభ నుండి పార్టీ పనిలో లేకుండా సొంత పనులు చేసుకుంటూ నేడు పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున పార్టీ నుండి రవినాయక్‌ను బహిష్కరిస్తున్నట్టు తెలిపారు.పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు, నెమ్మాది వెంకటేశ్వర్లు, కోటగోపి, జిల్లా కమిటీి సభ్యులు పల్లె వెంకటరెడ్డి, దుగ్గి బ్రహ్మం, వట్టెపు సైదులు, పాండునాయక్‌, షేక్‌యాకుబ్‌, మండల కార్యదర్శి పోషణబోయిన హుస్సేన్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం.రాంబాబు, పట్టణ నాయకులు శీలం శ్రీను, పాశం వెంకటనారాయణ,యలక సోమయ్య, రన్‌మియా, రామ్మూర్తి, కోదాటి సైదులు తదితరులు పాల్గొన్నారు.