క్రమశిక్షణలను ఉల్లంఘించిన సిద్దాల నాగరాజును ఎస్ఎఫ్ఐ నుండి బహిష్కరణ

నవతెలంగాణ – కంటేశ్వర్
క్రమ శిక్షణలలో ఉల్లంఘించిన సిద్ధల నాగరాజును ఎస్ఎఫ్ఐ నుండి బహిష్కరణ చేసినట్లు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మహేష్ విగ్నేష్ లో తెలిపారు. ఈ మేరకు మంగళవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మహేష్ , రాచకొండ విఘ్నేష్ లు మాట్లాడుతూ.. ఎస్ఎఫ్ఐ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి సిద్ధల నాగరాజు ను ఎస్ఎఫ్ఐ సంఘం నిబంధనలను అతిక్రమించడం వలన ఎస్ఎఫ్ఐ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఎస్ఎఫ్ఐ నుండి బహిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి సంబంధం లేదని ప్రెస్ మీట్ ముఖంగా విద్యార్థులకు ప్రైవేట్ ప్రభుత్వ యాజమాన్యాలకు తెలియజేయడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో ఎస్ ఎఫ్ ఐ విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఎల్లప్పుడు పోరాటం నిర్వహించడంలో ముందుంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు దీపికా, జిల్లా సహాయ కార్యదర్శి ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు.