– టీఎస్‌డబ్ల్యుఆర్‌ఈఎస్ కార్యదర్శి సీతాలక్ష్మి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఎస్‌డబ్ల్యుఆర్‌ఈఎస్ అకడమిక్-1, టీఎస్‌డబ్ల్యుఆర్, టీటీడబ్ల్యుఆర్ సంస్థల్లో బ్యాక్‌లాగ్ ఖాళీ సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు చేసుకోవాలని తెలంగాణ సామాజిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సంఘం కార్యదర్శి సీతాలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. టీఎస్‌డబ్ల్యుఆర్ కో-ఎడ్ అలుగునూర్(కరీంనగర్ జిల్లా), గౌలిదొడ్డి (రంగారెడ్డి జిల్లా), ఎనిమిది, తొమ్మిదో తరగతులకు రెగ్యులర్ అడ్మిషన్లు 2024-25 విద్యాసంవత్సరానికి టీటీడబ్ల్యుఆర్ పరిగి, ఖమ్మ లోని రెసిడెన్షియల్స్‌కు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేదీకి పొడించామని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో వచ్చే నెల 21నఉదయం11నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి http://tswreis.ac.in, http://tgtwgurukulam.telangana.gov.in వెబ్‌సైట్‌లను సందర్శించాలని సూచించారు. ఇతర వివరాల కోసం, దరఖాస్తుదారులు సమీపంలోని నివాస సంస్థలను సంప్రదించాలని కోరారు.