5వ తరగతి ప్రవేశపరీక్షకు ధరఖాస్తుల గడువు  పొడగింపు

నవతెలంగాణ – డిచ్ పల్లి
సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న ఐదవ తరగతి 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశపరీక్షకు ఆన్ లైన్ లో ధరఖాస్తుల గడువు 23 వరకు పొడిగించడం జరిగిందని ఆ సంస్థ నిజామాబాద్ ప్రాంతీయ సమన్వయాధికారిణి కె. అలివేలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ రీజియన్ పరిధిలో నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ మూడు జిల్లాలు ఉన్నాయని తెలిపారు.నిజామాబాద్ జిల్లాలో 6 బాలికలు, 3 బాలురు, కామారెడ్డి జిల్లాలో 7 బాలికలు, 4 బాలురు, నిర్మల్ జిల్లాలో 4 బాలికలు, 1 బాలురు పాఠశాలలు / కళాశాలలో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు తరగతుల నిర్వహణ జరుగుతుందని తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంలో ఏదైనా ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలల్లో నాల్గవ తరగతి చదువుచున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మైనార్టీ లకు చెందిన విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు నమోదు చేసుకోవటానికి అర్హులని తెలిపారు. అర్హతకలిగిన విద్యార్థినీ విద్యార్థులు www.tswreis.ac.in వెబ్ సైట్ ద్వారా రూ. 100 మాత్రమే రుసుము చెల్లించి అంతర్జాలం ద్వారా పేరు నమోదుచేసుకోవచ్చని వివరించారు. ఫిబ్రవరి 11న ఉదయం 11గంటల నుంచి మద్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిచ్చ నున్నామని తెలిపారు. పరీక్ష తేదీకి పది రోజుల ముందు నుండి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రవేశపరీక్షలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించు. కోవాలని కోరారు. అర్హత మరియు ఇతర నిబంధనల కొరకు సంస్థ వెబ్ సైట్ www.tswreis.ac.in ను సందర్శించాలని కోరారు.