‘సాయుధ దళాల చట్టం’ పొడిగింపు

– అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌లో మరో ఆరు నెలలు
– కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌
న్యూఢిల్లీ : వివాదాస్పద సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌లోని కొన్ని ప్రాంతాలలో పొడిగించబడింది. అక్టోబర్‌ 1 నుంచి మరో ఆరు నెలల పాటు ఇది అమలులో ఉండనున్నది.
ఈ మేరకు కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం ఎనిమిది జిల్లాల్లో, నాగాలాండ్‌లోని మరో ఐదు జిల్లాల్లోని 21 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఏఎఫ్‌ఎస్‌పీఏని మరో ఆరు నెలల పాటు పొడిగించినట్టు నోటిఫికేషన్‌ పేర్కొన్నది.
దిమాపూర్‌, నియులాండ్‌, చుమౌకెడిమా, మోన్‌, కిఫిర్‌, నోక్లాక్‌, ఫేక్‌, పెరెన్‌.. ఇలా ఎనిమిది జిల్లాలకు ఈ చట్టం వర్తిస్తుంది. ఇది కొహిమా జిల్లాలోని ఖుజామా, కోహిమా నార్త్‌, కొహిమా సౌత్‌, జుబ్జా, కెజోచా పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో విస్తరించబడింది. ఈ వివాదాస్పద చట్టం గత కొంత కాలంగా ఈ రెండు రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో అక్కడి పరిస్థితులను బట్టి అధికారులు పొడిగిస్తూ వస్తున్నారు.