– ఈనెల 15 వరకు ప్రవేశాలకు అవకాశం
నవతెలంగాణ కమ్మర్ పల్లి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2024-25 విద్య సంవత్సరానికి గాను డిగ్రీ ప్రవేశాలకు ఈనెల 15 వరకు గడువు పొడిగించారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభ్యాసకుల సహాయ కేంద్రం కోఆర్డినేటర్ బిల్లా రాజేందర్, సీనియర్ అకాడమిక్ కౌన్సిలర్ కడకుంట్ల దశరథం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్య సంవత్సరానికి గాను డిగ్రీ మొదటి సంవత్సరంలో నేరుగా ప్రవేశం పొందడానికి ఇంటర్మీడియట్ పాస్ లేదా ఇంటర్ తో సమానమైన ఇంటర్మీడియట్ నేషనల్ స్కూల్, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ, పాలిటెక్నిక్ మూడు సంవత్సరాల కోర్స్, ఐటిఐ, డైరీ ఒకేషనల్, ఓఏ, ఈఈటి వంటి కోర్సులు పాసైన వారు డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందడానికి అర్హులని తెలిపారు. బిఏ, బీకాం, బీఎస్సీ ఆర్ట్స్, కంప్యూటర్ గ్రూపులలో డిగ్రీ మొదటి సంవత్సరం తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశం పొందేందుకు సంబంధిత ఫీజు వివరాలు www.braouonline. in లో ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత ఫీజులు మీసేవ, ఆన్ లైన్ కేంద్రాల్లో చెల్లించి, దానికి సంబంధించిన రసీదును, స్టడీ సర్టిఫికెట్లను రెండు సెట్ల జిరాక్స్ లు సంబంధిత అభ్యాసకుల కేంద్రంలో సమర్పించాలని సూచించారు. అదేవిధంగా డిగ్రీ రెండవ, మూడవ సంవత్సరం ఫీజులు చెల్లించేందుకు ఈనెల 15వ తేదీ వరకు అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థిని విద్యార్థులు సకాలంలో ఫీజులు చెల్లించి ప్రవేశాలు పొందాలని కోరారు. మరిన్ని వివరాలకు 7569841742 ఫోన్ నెంబర్లు సంప్రదించాలని అభ్యాసకుల సహాయ కేంద్రం కోఆర్డినేటర్ బిల్లా రాజేందర్, సీనియర్ అకాడమిక్ కౌన్సిలర్ కడకుంట్ల దశరథం ప్రకటనలో కోరారు.